Quick employment with this course
Quick employment with this course
ITI is the best course to get a job after 10th. Various ITIs are available across the country. They impart vocational and technical training to the students and provide employment. There is a huge demand for ITI students in government departments. ITI graduates can get employment in factories in public and private sectors. One can get admission in a two-year, one-year course in ITI and specialize in technical education only with TEN qualification. With this, there is a high chance of getting employment at a young age. Almost every year there are vacancies for ITI Trainees in Railways, Army, Navy, Airforce, Irrigation, BHEL, HAL, SAIL, NTPC, ONGC etc. Private companies like Tata Motors, Maruti Suzuki, Hyundai, Honda, ITC, Mahindra are recruiting ITI students on a large scale.
The state government provides scholarship during ITI training. After completion of ITI course apprentice should be trained in any industry for a specified period of time. 70 percent of the training time is devoted to practical training. The remaining 30 percent of time is allocated to trade theory, work calculator and science, engineering drawing, library and extracurricular activities. Preference will be given to those who have worked as an apprentice in job placements. After taking ITI training one can do polytechnic to pursue further education. Students who pass ITI in the three-year polytechnic course are directly admitted to the second year. Admission can be obtained through entrance in second year of B.Tech after Polytechnic. Under the Pradhan Mantri Mudra Yojana, loans are given without any collateral to the youth who have studied ITI to get self employment. This is a good option if you want to get employed quickly in today's competitive world.
ఈ కోర్సుతో త్వరగా ఉపాధి
పదోతరగతి తర్వాత ఉద్యోగం సంపాదించాలంటే ఐటీఐ బెస్ట్ కోర్సు. రకరకాల ఐటీఐలు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. ఇవి విద్యార్థులకు వృత్తిపరమైన, సాంకేతిక శిక్షణను అందించి ఉపాధి కల్పిస్తాయి. ఐటీఐ చేసిన విద్యార్థులకు ప్రభుత్వ శాఖల్లో పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఫ్యాక్టరీలలో ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఐటీఐ చదివిన యువతకు ఉపాధి లభిస్తుంది. టెన్త్ అర్హతతోనే ఐటీఐలో రెండేళ్ల, ఏడాది వ్యవధి కోర్సులో ప్రవేశం పొంది సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించవచ్చు. దీంతో చిన్న వయస్సులోనే ఉపాధి పొందే అవకాశం ఎక్కువగా ఉంది. ఐటీఐ శిక్షణ తీసుకున్న వారికోసం రైల్వే, ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఇరిగేషన్, BHEL, HAL, SAIL, NTPC, ONGC వంటి సంస్థలలో దాదాపు ప్రతి సంవత్సరం ఖాళీలు ఉంటాయి. ప్రైవేటు సంస్థలు టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, హ్యుందాయ్, హోండా, ఐటీసీ, మహీంద్ర వంటివి ఐటీఐ విద్యార్థులను పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకుంటున్నాయి.
ఐటీఐ శిక్షణ సమయంలో రాష్ట్రప్రభుత్వం స్కాలర్షిప్ అందిస్తుంది. ఐటీఐ కోర్సు పూర్తయ్యాక ఏదైనా పరిశ్రమలో నిర్దిష్ట కాలవ్యవధిలో అప్రెంటిస్ శిక్షణ పొందాలి. శిక్షణ సమయంలో 70శాతాన్ని ప్రాక్టికల్ ట్రైనింగ్కు కేటాయిస్తారు. మిగిలిన 30శాతం సమయాన్ని ట్రేడ్ థియరీ, వర్క్ క్యాలిక్యులేటర్ అండ్ సైన్స్, ఇంజినీరింగ్ డ్రాయింగ్, లైబ్రరీ అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్కు కేటాయిస్తారు. ఉద్యోగ నియామకాల్లో అప్రెంటిస్ గా పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఐటీఐ శిక్షణ తీసుకున్న తర్వాత తదుపరి చదువు కొనసాగించాలంటే పాలిటెక్నిక్ చేయవచ్చు. మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సులో ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం కల్పిస్తారు. పాలిటెక్నిక్ చేసిన తర్వాత బీటెక్ రెండో సంవత్సరంలో ఎంట్రెన్స్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. ఐటీఐ చదివిన యువత సొంతంగా ఉపాధి పొందేందుకు ప్రధాన మంత్రి ముద్ర యోజన కింద ఎలాంటి షూరిటీ లేకుండా రుణాలు ఇస్తారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో త్వరగా ఉపాధి పొందాలనుకుంటే ఇది మంచి ఆప్షన్.
Comments
Post a Comment