Right to Information Act

 Right to Information Act

It is the responsibility of the government to provide information but it is the right of citizens to get it. Right to Information is a wonderful opportunity given to the citizens to enhance transparency in government administration, avoid secrecy in administrative affairs and keep the policies of the government before the people. The right to information is enshrined in Article 19(1A) of the Fundamental Rights of the Constitution of India. In 2005, Parliament enacted the Right to Information Act. The President signed this bill on June 15, 2005. This Act of 2005 October


Effective from 12th The central government has directed all the states to make necessary arrangements for the implementation of this law. Before the Center brought the Right to Information Act, 9 states had enacted Right to Information Acts at their own level between 1997-2003. Hiralal Samaria is currently serving as the Central Information Commissioner.


Exceptions

Matters prejudicial to national sovereignty, national defence, foreign friendships, details of cabinet discussions, contempt of court communications are exempted from the Right to Information Act.


సమాచార హక్కు చట్టం

సమాచారాన్ని ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అయితే దాన్ని పొందడం పౌరుల హక్కు. ప్రభుత్వ పాలనలో పారదర్శకతను పెంపొందించి, పరిపాలన వ్యవహారాల్లో గోప్యతను నివారించి, ప్రభుత్వ పాలనా విధానాలను ప్రజల ముందుకు ఉంచేందుకు పౌరులకు కల్పించిన అద్భుత అవకాశమే సమాచార హక్కు. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలోని ప్రకరణ 19(1ఏ)లో సమాచార హక్కును అంతర్గతంగా పొందుపరిచారు. 2005లో పార్లమెంటు సమాచార హక్కు చట్టాన్ని రూపొందించింది. 2005 జూన్ 15న రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేశారు. ఈ చట్టం 2005 అక్టోబర్


12వ తేదీ నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. కేంద్రం సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడానికి ముందే 9 రాష్ట్రాలు 1997-2003 మధ్యకాలంలో తమ స్థాయిలోనే సమాచార హక్కు కల్పిస్తూ చట్టాలు తెచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్గా హీరాలాల్ సమారియా విధులు నిర్వర్తిస్తున్నారు.


మినహాయింపులు

దేశ సౌరభౌమత్వంకు భంగం కలిగించే అంశాలు, దేశ రక్షణ, విదేశీ స్నేహాలు దెబ్బతినే అంశాలు, కేబినెట్ చర్చల వివరాలు, కోర్టు ధిక్కార సమాచారాలు వంటివి సమాచార హక్కు చట్టం నుండి మినహాయించారు.

Comments

Popular posts from this blog

Children Horse ride in Hyderabad

Quick employment with this course