Kids not going to bed on time?
పిల్లలు సమయానికి పడుకోవడం లేదా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా పిల్లలు లేటుగా నిద్రపోవడం, పొద్దుపోయేవరకు నిద్ర లేవకపోవడం చూస్తుంటాం. ఇది పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. అలాగే నిద్రలేమి, ఊబకాయం, అలసట, డిప్రెషన్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల నిద్రకు సంబంధించి పేరెంట్స్ ఈ కింది విషయాలపై దృష్టిపెట్టాలి.
భోజనం చేసిన తర్వాత కొందరు పేరెంట్స్ ల్యాప్ ట్యాప్ పట్టుకుని వర్క్ చేయడం, ఫోన్ పట్టుకుని కూర్చోవడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల పిల్లలు నిద్రపోకుండా మనపక్కన కూర్చోవడంతో వారి నిద్రకు భంగం వాటిల్లుతుంది.
ఫోన్ చూడటం, ల్యాప్ ట్యాప్ వర్క్ చేయడం వంటివి బెడ్రూమ్లో కాకుండా వేరే గదిలో చేసుకుంటే మంచిది. అప్పుడే పిల్లల దృష్టి అటు మరలకుండా హాయిగా నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అందరూ కలిసి టీవీ చూస్తే కాసేపు చూపి టీవీ ఆఫ్ చేయడం మంచిది.
* రాత్రివేళ పిల్లలు నిద్రపోవడానికి 3 గంటల ముందే వారిని ఫోన్లకు దూరంగా ఉంచడం మంచిది.
* పిల్లలు అతిగా తింటే అజీర్ణం వచ్చే ప్రమాదం ఉంది. కావున మితంగా భోజనం పెట్టాలి. అప్పుడే సరిగా నిద్రపోతారు.
Kids not going to bed on time?
Everywhere we look nowadays, we see children sleeping late and not waking up until morning. It affects the growth of the child. Also, experts warn that there is a risk of insomnia, obesity, fatigue and depression. Parents should focus on the following things regarding children's sleep.
After eating, some parents work on the laptop and sit on the phone. Due to this, children sit next to us without sleeping and their sleep is disturbed.
It is better if you look at the phone and do laptop work in a room other than the bedroom. Only then will the child's attention be able to sleep comfortably. If everyone is watching TV together, it is better to show it for a while and turn off the TV.
* At night it is better to keep children away from phones 3 hours before they go to sleep.
* Children are at risk of indigestion if they eat too much. So eat in moderation. Only then will you sleep properly.
Comments
Post a Comment